డౌన్ ఘాట్ రోడ్డులో వాహనాల రాక పోకల పునరుద్ధరణ

Restoration of vehicular traffic on Down Ghat Road

0
122

అలిపిరి నుంచి తిరుమలకు శుక్రవారం ఉదయం నుంచి ఒక మార్గంలో వాహనాల రాకపోకలను పునరుద్ధరించినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. తిరుమల నుంచి తిరుపతికి దిగే ఘాట్ రోడ్డు లో విరిగిపడ్డ కొండచరియలను టీటీడీ అధికారులు, సిబ్బంది శ్రమించి తొలగింపజేశారు.

భక్తుల సౌకర్యం దృష్యా ఈ మార్గంలో గంట పాటు తిరుమల నుంచి అలిపిరి, గంట పాటు అలిపిరి నుంచి తిరుమలకు చొప్పున వాహనాలను అనుమతించడం జరుగుతోంది. భక్తులెవరు ఫోటోల కోసం వాహనాలు దిగడం, వాహనాలను ఆపి ఉంచడం లాంటివి చేసి తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

భారీ వర్షాల కారణంగా అలిపిరి నుంచి తిరుమలకు వెళ్ళే ఘాట్ రోడ్ లో అనేక చోట్ల కొండ చరియలు విరిగి పడటంతో వాటి తొలగింపు కార్యక్రమం జరుగుతోంది. మధ్యాహ్నం తరువాత పరిస్థితిని అంచనా వేసి ఈ మార్గంలో వాహనాలను అనుమతించే విషయంపై టీటీడీ నిర్ణయం తీసుకుంటుంది.