Breaking News- చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు..పురుగుల మందు తాగిన టీడీపీ కార్యకర్తలు

Inappropriate remarks on Chandrababu..TDP activists who drank insecticide

0
100

ఏపీ​ శాసనసభలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వైకాపా సభ్యులు ఏకంగా ఆయన సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెక్కి వెక్కి ఏడ్చారు.

టీడీపీ అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలతో మనస్థాపం చెందిన ఇద్దరు కార్యకర్తలు పురుగుల మందు తాగారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, ఆస్పత్రికి తరలించారు.