ఈ శునకం ఆస్తి ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

This dog is the heir to hundreds of crores of property!

0
97

ఓ శునకం వందల కోట్ల వారసురాలు అంటే ఆశ్చర్యం కలుగక మానదు. గుంథర్-6 అనే శునకం వందల కోట్ల ఆస్తికి వారసురాలట. ఆ కుక్కకు అంత ఆస్తి ఎక్కడిదని ఆలోచిస్తున్నారా..మనలాగే ఆ శునకానికి వారసత్వ పరంపరలో ఈ ఆస్తి వచ్చిందంట. ఇప్పుడు ఆ కుక్క ఆస్తి ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.!

ఆ కుక్క ఆస్తి భారత కరెన్సీలో దాదాపు రూ.238 కోట్లు. మరి అంతటి ఆస్తి గల కుక్క ఎక్కడ ఉందొ అనుకుంటున్నారా. మన దేశంలో కాదండి అమెరికాలో. అసలు ఆ శునకానికి అంతటి విలువ గల ఆస్తి ఏమున్నాయో ఆ ఆస్తి దాని పేరున రాసింది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. మయామీ ప్రాంతానికి చెందిన కార్లోట్టా అనే మహిళ గుంథర్-3 అనే శునకాన్ని ఎంతో ముచ్చటపడి పెంచుకుంది. కార్లొట్టా సంపన్నురాలు. ఎంతో విలువైన భవనాన్ని ఆమె గుంథర్-3 పేరున రాసింది.

1928లో నిర్మితమైన ఆ భవనంలో ఏకంగా 9 బెడ్రూంలు ఉన్నాయి. ఓ స్విమ్మింగ్ పూల్ కూడా ఆ భవన ప్రాంగణంలో ఉంది. అంతేకాదు, గుంథర్-3 తదనంతరం దాని వారసులకు ఆస్తి సంక్రమించాలని వీలునామాలో పేర్కొంది. ఆ విధంగా ఆస్తి ఇప్పుడు గుంథర్-6కి దక్కింది. కార్లోట్టా 1992లో మరణించారు. అప్పటి నుంచి గుంథర్ శ్రేణిలోని కుక్కల తరఫున ఆస్తి వ్యవహారాలను ఆమె న్యాయవాదులే చూసుకుంటున్నారు.

తాజాగా గుంథర్-6 పేరిట ఉన్న భవంతిని వేలం వేయాలని నిర్ణయించారు. కాగా గతంలో ఈ భవనాన్ని పాప్ గాయని మడోన్నా కొనుగోలు చేసి, కొన్నాళ్ల తర్వాత అమ్మేశారు. అది పలు చేతులు మారగా, కార్లొట్టా కొనుగోలు చేశారు.