టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం క్రియాశీలకంగా ఉంటున్నారు. తాజాగా ఆమె బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కలిసి, ఆయనను సత్కరించారు. ఇటీవలే హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ‘ఏక్ ఓంకార్’ అనే మతపరమైన జ్ఞాపికను కూడా ఆయనకు బహూకరించారు.
ఈ సందర్భంగా ఇరువురు శాంతి కపోతాలను గాల్లోకి ఎగురవేశారు. దీనిపై పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో స్పందించారు. రైతు చట్టాలను కేంద్రం రద్దు చేసిందని విన్నాం. స్వేచ్ఛా భావనలకు నిదర్శనంగా పావురాళ్లను ఎగురవేయడానికి ఇది సరైన సమయం. పావురాళ్లు శాంతికి చిహ్నాలు అని పేర్కొన్నారు. ఆత్మగౌరవం, దయ, అంకితభావం ఉన్న వ్యక్తులను గురునానక్ ఎప్పుడూ దీవిస్తాడని పూనమ్ పేర్కొన్నారు.