మూడు రాజధానుల బిల్లు..ఏపీ ప్రభుత్వం ముందు 4 ఆప్షన్లు..

Three Capitals Bill..4 options before the AP government ..

0
70

మూడు రాజధానులపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్నట్లు వైకాపా ప్రభుత్వం తెలిపిందని..ఈ మేరకు రాష్ట్ర హైకోర్టుకు అడ్వొకేట్‌ జనరల్‌ తెలిపారు.

వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను రద్దు చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుందని.. చట్టం రద్దుపై అసెంబ్లీలో సీఎం జగన్​ ప్రకటన చేయనున్నట్లు త్రిసభ్య ధర్మాసనం ముందు అడ్వకేట్ జనరల్ నివేదించారు.

అయితే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ముందు 4 ఆప్షన్లు ఉన్నాయి. అవి ఏంటంటే..

ఆప్షన్1 : న్యాయపరమైన చిక్కులు లేకుండా 3 రాజధానులకు కొత్త బిల్లు

ఆప్షన్2 : సాంకేతికంగా 3 రాజధానులను ప్రస్తావించకుండా అధికార వికేంద్రీకరణ

ఆఫ్షన్3 : పూర్తి స్థాయి రాజధానిగా అమరావతి అని చెప్తూనే మిగతా ప్రాంతాల అభివృద్ధి

ఆష్షన్4: పరిపాలనా రాజధాని విశాఖ అని చెప్తూనే అమరావతిలో పాలనా వ్యవహారాలు