రాజధాని విషయంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం..ఆ బిల్లుపై వెనక్కి..

0
74

అవును అనుకుందే జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు వెనక్కి తీసుకుంటూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగాంగానే అసెంబ్లీలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే CRDA రద్దు ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టారు. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను కేబినెట్‌ రద్దు చేసినట్లు అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టు తెలిపిన విషయం తెలిసిందే.

అమరావతి రాజధాని వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. 3 రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.