తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక పూర్తయింది. ఎమ్మెల్యే కోటాలో MLC అభ్యర్థులుగా కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, బండా ప్రకాశ్, రవీందర్, కౌశిక్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల గడువు పూర్తి కావడంతో ఆ ఆరుగురి ఎన్నిక ఏకగ్రీవమైనట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఇక స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. లోకల్ బాడీ ఎమ్మెల్సీల నామినేషన్లకు గడువు ఇవాల్టితో పూర్తవుతుంది. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థులు ఇవాళ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నిజామాబాద్‌లో ఇవాళ ఎమ్మెల్సీగా కవిత నామినేషన్ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 1:45కు నామినేషన్ వేయనున్నారు కవిత. మరోవైపు కాంగ్రెస్ కూడా ఎమ్మెల్సీ బరిలో నిలవాలని నిర్ణయించింది. డిసెంబర్ 10న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.
ఆదిలాబాద్ -దండె విఠల్..
మహబూబ్ నగర్-కసిరెడ్డి నారాయణరెడ్డి, సాయిచంద్
ఖమ్మం- తాత మధు
రంగారెడ్డి -శంభీపూర్ రాజు, మహేందర్ రెడ్డి
వరంగల్- పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
నల్గొండ- ఎంసీ కోటిరెడ్డి
మెదక్- యాదవ రెడ్డి
కరీంనగర్ – ఎల్ రమణ, భాను ప్రసాద్ రావు
నిజామాబాద్ -ఆకుల లలితను ఖరారు చేసినట్టు తెలుస్తోంది.