తెలంగాణలో దారుణం..స్నేహితుని భార్యపై కన్నేసి..

0
154

తెలంగాణ: హైదరాబాద్ లో దారుణ ఘటన జరిగింది. స్నేహితులే కదా అని ఇంటికి తీసుకొస్తే అమానుషానికి పాల్పడ్డారు. ఫ్రెండ్ భార్య అని చూడకుండా తమ కుటిలబుద్దిని చూపించారు. పక్కా ప్లాన్ తో ఆమెపై అత్యంత క్రూరంగా వ్యవహరించి కోరిక తీరాక కాటికి పంపించారు.

వివరాల్లోకి వెళితే..అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తారామతిపేట్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి తన ఇద్దరు స్నేహితులతో కలిసి తన ఇంటికొచ్చారు. మద్యం సేవించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అంతా సిద్ధమనుకున్న తర్వాత ముగ్గురు కలిసి మద్యం తాగారు. కానీ ఆ ఇద్దరు మగాళ్లకు ఆ ఇంటి మహిళపై కన్నేశారు. దీనితో ఎలాగైనా ఆమెను బలవంతంగా అనుభవించాలనుకున్నారు.

పథకం ప్రకారం ఆమె భర్తకు మరింత మద్యం తాగించారు. అతను స్పృహ కోల్పోయిన తర్వాత..ఆ ఇద్దరు కలిసి వివాహితపై అత్యాచారం చేశారు. ఆమె ప్రతిఘటించిన ఆ మానవ మృగాలు కనికరించలేదు. మరింత రెచ్చిపోయి ఆమెను హత్య చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.