ప్రజాస్వామ్య, పరిరక్షణ. భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి, సమాన హక్కులు, సౌభ్రాతృత్వం, స్వేచ్ఛ, సమానత్వంకై, విద్య, వైద్యం ప్రజలందరికీ దక్కాలని, ఉపాధి కరువై, కడుపు మాడి పోతున్నా. యువకుడా. సమస్త ప్రజల సింహ స్వప్నమై, రేపటి నవతరం యువ నాయకుడవై కదలిరా దేశ పాలన వ్యవస్థలో మార్పు కొరకై.
స్వాతంత్య్ర సంగ్రామంలో యువత కీలకంగా ఉద్యమించిన తీరు చరిత్రపుటల్లో చదివాము. స్వతంత్ర అనంతర దేశంలో యువత ఉద్యమాలు ఒకానొక స్థాయిలో, ఉవ్వెత్తున సాగిన తీరు, ఉపాధి హక్కులకై నినదించిన తీరు చూశాం. ప్రభుత్వాలు ప్రజల పరంగా లేనప్పుడు, కనీస అవసరాలు తీర్చలేని వ్యవస్థ కొనసాగినప్పుడు, దోపిడీ, దౌర్జన్యాలు అధికమైనప్పుడు, వాటికి వ్యతిరేకంగా యువత ఉద్యమించారు. యూనివర్సిటీలో, విద్యాలయాల్లో యువత హక్కులకై, నిరంతరంగా పోరాటంలో ముందు వరసలో నిలిచారు.
ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచం, దేశం ఒక కుగ్రామంగా ఏర్పడిన తర్వాత, ప్రతిదీ ఇంటర్నెట్ మాయాజాలంలో పడి ప్రభుత్వ పనితీరు ప్రశ్నించడంలో, నిర్లక్ష్యంగా ఎవరికి వారే ఒంటరిగా ఉండి పోతున్న సందర్భం కనిపిస్తోంది. సమస్యలన్నింటికీ కారణం. ఈ ప్రభుత్వ విధానాలే కారణమనే విషయాన్ని సులభంగా మర్చిపోతున్నాము. దేశ విదేశాలలో యువత గమ్మత్తయిన రంగుల ప్రపంచంలో మునిగిపోతున్నారు.
సామాజిక బాధ్యతగా వ్యవహరించాలని తీర్చిదిద్ధి, విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రభుత్వాలు. బాధ్యత మరచి పాలన చేస్తున్నారు. కులం, మతం, ప్రాంతం అనే రంగు పూసి యువతను విడదీస్తున్నారు. అశాస్త్రీయమైన భావజాలం వ్యాపింపజేసి మనసును మూఢనమ్మకాల ఊబిలోకి నెట్టివేస్తున్నారు.
నేను, నా దేశం. అనే భావన మరిచిపోయి, నేనూ నా వ్యక్తిగతం అనే స్థితిలోకి నెట్టబడుతున్నారు. ఉన్న హక్కులు, బాధ్యతలు మర్చిపోయి, అంధకారం వైపు యువత అడుగులు వేస్తున్నా సందర్భంలో దీనికి కారణం ఎవరనే ప్రశ్న గ్రహించలేకపోతున్నా యువతరం.
దేశం కోసం వేలాది మంది యువకులు అమరవీరుల అయినారు. భగత్ సింగ్,రాజ్ గురు, సుఖదేవ్ లాంటి వాళ్లను ఆదర్శంగా తీసుకోవాలి. ఆనాడు బ్రిటిష్ వ్యవస్థపై తిరుగుబాటు చేస్తే, స్వతంత్రం సిద్ధించింది. అలాగే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఉద్యమం చూసాము. యువత తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, అమరులైనారు. వీళ్లంతా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడి, సొంత పాలన కోసం నిరంతరం పోరాడి, రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయారు. తమకంటూ ఒక స్థానాన్ని ప్రజల గుండెల్లో ఈ నేలపై సంపాదించారు.
ఈ దేశానికి ఒక దిశా, నిర్దేశం చేసే పాలన వ్యవస్థ ఎలా ఉండాలో ఒక డాక్యుమెంటరీ రూపొందించి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. భారత రాజ్యాంగం రాసి ఈ దేశ ప్రజలకు అందించారు. అందులో పార్లమెంటరీ వ్యవస్థ సమస్త ప్రజల హక్కులు. న్యాయ, పోలీస్ అనేక రంగాల హక్కులు వీధులు బాధ్యతలు వాటి చట్టాలు అమలుపరచే విధానము, వాటి పరిరక్షణ కోసం సంపూర్ణంగా అనేక అంశాలను క్రోడీకరించి, విశ్లేషించి. ఒక సమున్నతమైన ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగము మనకు అందించిన అపర మేధాసంపన్నుడు. వారిచ్చిన హక్కులను మరచిపోకుండా ప్రజాస్వామ్యయుత పాలన పారదర్శకత కై యువత నడుం బిగించాలి.
శ్రీ, శ్రీ చెప్పినట్లు కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు. కొంతమంది యువకులు తాతల, తండ్రుల నాటి ఆస్తులకు దాసోహులు, కొంతమంది. యువకులు పవన నవజీవన బృందావన నిర్మాతలు.
మనమందరము కూడా బృందావన నిర్మాతలుగా, సాగాలి. బాధ్యతలను విస్మరించే, ప్రభుత్వ తీరును ప్రజాక్షేత్రంలో అర్థం చేసుకోవాలి. సమిష్టితత్వం కలిగిన, చదువుకున్న యువత సమాజం ఒక బాధ్యతగా తీసుకొని, ప్రతి యువకుడు ముందుకు సాగాలి.
స్వతంత్ర ఉద్యమం కానీ, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని గుర్తు చేసుకోవాలి. చరిత్రను యాది చేసి కదనరంగంలో దూకి, సమరశీల ఉద్యమాలకై యువతరం సిద్ధం కావాలి. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులకై , పాలనా విధాన మార్పుకై, యువత ప్రాధాన్యత పెరగాలి. నేటి యువత ఐక్యంగా యువజన సమస్యలతో పాటు, ప్రధానంగా విద్య, వైద్యం ఉపాధి హక్కులకై కదలాలి.
సేకరణ: గద్దల మహేందర్