చలికాలంలో చర్మ సమస్యలు వేధిస్తున్నాయా? అయితే ఇలా చేయండి

Troubled by skin problems in winter? Do this though

0
86

సాధారణంగా చలికాలంలో చర్మ సమస్యలు వేధిస్తుంటాయి. ఈ సీజన్లో ఎక్కువగా చర్మం పొడి బారడడం..నిర్జీవంగా మారినట్లుగా అనిపించడం జరుగుతుంది. అయితే ఈ సమస్యలను తగ్గించేందుకు ఏం చేయాలి? ఆ సమస్యలను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ఇంట్లో తయారు చేసిన వెన్నలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంలోని కొల్లాజెన్‏ను నిర్వహించడంలో సహయపడుతుంది. అంతేకాకుండా చర్మంలో ముడతలు రాకుండా నివారిస్తుంది.. వెన్న మాయిశ్చరైజర్, యాంటీ మార్క్స్ క్రీమ్‏గా పని చేస్తుంది.

వెన్నతో తయారు చేసిన ఈ మాయిశ్చరైజర్‌ని అప్లై చేయడం ద్వారా చర్మం లోపల నుంచి హైడ్రేట్ గా ఉంటుంది.

వెన్నలో విటమిన్ ఎ, ఇ మరియు రెటినోల్ ఉన్నాయి, ఇవి చర్మంలో కొల్లాజెన్‌ను పెంచడంలో సహాయపడతాయి.

ఇది చర్మానికి పూర్తి పోషణను అందిస్తుంది. చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

వెన్నలో విటమిన్ ఇ ఉంటుంది, ఇది చర్మాన్ని లోపలి నుంచి మెరుగ్గా చేస్తుంది.

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని శుభ్రపరచడానికి, రక్షించడానికి సహాయపడతాయి.