మెగా అభిమానులకు గుడ్ న్యూస్..’సిద్ధ’ టీజర్ రిలీజ్​ ఎప్పుడంటే?

Acharya Update- When is the 'Siddha' teaser release?

0
106

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు ఓటమి అంటూ ఎరగని కొరటాల దర్శకత్వం వహిస్తుండడం, రామ్‌ చరణ్‌ తండ్రి చిరంజీవితో కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై ఎక్కడలేని అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రమోషన్లలో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన కొత్త అప్డేట్​ను ఇచ్చింది చిత్రబృందం. నవంబరు 28న రామ్​చరణ్​ సన్నివేశాలకు సంబంధించిన చిత్ర టీజర్​ను రిలీజ్​ చేయనున్నట్లు తెలిపింది.

ఈ చిత్రంలో దేవాలయాల బాగు కోసం పాటుపడే పాత్రలో చిరు కనిపించనున్నారు. అలానే నక్సలైట్​ పాత్రలోనూ అభిమానుల్ని అలరించనున్నారు. ఇక ఈ సినిమాలో చిరుకు జోడిగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తుండగా, రామ్‌ చరణ్‌ సరసన పూజా హెగ్డే్‌ నటిస్తోన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.