చలికాలంలో ఒంట్లో శక్తి తగ్గి, జబ్బుల బారినపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు మన ఆహారంలో ఏ ఆహారాన్ని భాగం చేసుకోవాలి. చలికాలంలో శరీరం వెచ్చగా ఉండటానికి ఎటువంటి ఆహారం సాయపడుతుంది. ఇలాంటి సమయంలో తక్షణ సత్తువను ఖర్జూర ప్రసాదించగలదా? ఇంకా ఖర్జూరతో ఏమేం లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
చలికాలంలో ఖర్జూరం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ ఖర్జూరాలో విటమిన్లు, ఖనిజాలు, క్యాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్, రాగి, మెగ్నీషియం వంటి పోషకాలు ఇందులో దండిగా ఉంటాయి. ఇవన్నీ తక్షణ సత్తువను ప్రసాదిస్తూనే ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఖర్జూరంలో ఐరన్ దండిగా ఉంటుంది. దీంతో హిమోగ్లోబిన్ స్థాయులు మెరుగవుతాయి. రక్తహీనత తగ్గుముఖం పడుతుంది. అలాగే గర్భిణుల్లో ఐరన్ లోపం తలెత్తకుండా ఖర్జూరం తినాలని సూచిస్తుంటారు. ఇది పిండం ఎదుగుదలకూ తోడ్పడుతుంది. ఈ చలికాలంలో ఖర్జూరంతో పాటు బాదం, జీడిపప్పు వంటి గింజపప్పులనూ కాసిన్ని తినటం మంచిది.
“ఖర్జూర తినండి..ఆరోగ్యాన్ని పదిలం చేసుకోండి”