ఆ మాస్టర్ ను కాపాడుకుంటా..సోనూసూద్ ట్వీట్

To protect that master..Sonusood tweet

0
99

ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‏లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. శివశంకర్ మాస్టర్ ఆరోగ్యం విషమంగా ఉందని..పెద్ద కొడుకుకు కరోనా బారిన పడి ప్రస్తుతం అపస్మారక స్థితిలో వెళ్లినట్లుగా వైద్యులు తెలిపారు.

మరోవైపు శివశంకర్ మాస్టర్ భార్యకు కూడా కరోనా సోకడంతో ఆమె హోం క్యారంటైన్లో ఉన్నారు. ఇప్పటికే ఆసుపత్రి బిల్లులు ఎక్కువయ్యాయని.. దాతలెవరైనా ముందుకు వచ్చి సాయం చేయాలని చిన్న కొడుకు అజయ్ కోరుతున్నారు.

ఇక ఈ విషయం తెలుసుకున్న రియల్ హీరో సోనూసూద్..శివశంకర్ మాస్టర్ చిన్న కొడుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నాడు. ఆయన ప్రాణాలను రక్షించేందుకు అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని సోనూసూద్ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.