బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు ఢిల్లీ అసెంబ్లీ ప్యానెల్ సమన్లు జారీ చేసింది. సిక్కులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కంగనాకు ఈ నోటీసులు ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ చద్దా ప్యానెల్ ముందు డిసెంబర్ ఆరో తేదీన హాజరు కావాలంటూ ఆదేశించారు. సిక్కులను కించపరిచే రీతిలో కంగనౌ కామెంట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియా సిక్కులపై అనుచిత రీతిలో వ్యాఖ్యలు చేసిన కంగనాపై ముంబైలోనూ కేసును నమోదు చేశారు. కొత్త సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపడుతున్న ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రైతుల తీరును కంగనా తప్పుపట్టారు.
కంగనా రనౌత్ కు మరో షాక్..!
Another shock for Kangana Ranaut ..!