రెసిడెన్షియల్‌ పాఠశాలలో కరోనా కలకలం

Corona commotion in a residential school

0
96

ఒడిశా మయూర్‌భంజ్‌లోని ప్రభుత్వ రెసిడెన్షియల్‌ బాలికల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. 259 విద్యార్థులు, 20 మంది సిబ్బంది ఉన్న ఈ పాఠశాలలో పెద్దఎత్తున కేసులు బయటపడటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. బాధిత విద్యార్థులకుకరోనా పరీక్షలు నిర్వహించగా 26 మందికి కొవిడ్‌ నిర్ధరణ అయినట్లు తాజా నివేదికల్లో వెల్లడైంది. ప్రస్తుతం బాధితులందరినీ పాఠశాల ప్రాంగణంలో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.