‘మా’ సభ్యుల కోసం మంచు విష్ణు కీలక ఒప్పందం..ఉచితంగా

Snow Vishnu key deal for 'our' members..free

0
84

‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ అధ్యక్షుడు మంచు విష్ణు తన కార్యాచరణ మొదలు పెట్టారు. తన మ్యానిఫెస్టోలో ముఖ్యంగా పేర్కొన్న సభ్యుల ఆరోగ్యంపై ఆయన దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ నగరంలోని ప్రముఖ ఆస్పత్రులతో ఒప్పందం చేసుకున్నారు.

ప్రతి మూడు నెలలకొకసారి ఉచిత మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయనున్నట్లు ట్విటర్‌ వేదికగా మంచు విష్ణు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆరోగ్యబీమా క్లెయిం కన్నా ఎక్కువ ఖర్చు అయితే, ఆ బిల్లులో కూడా రాయితీ ఇవ్వన్నట్లు ప్రకటించారు. ప్రతి ఆస్పత్రిలో కేవలం ‘మా’ సభ్యుల కోసమే ఒక సహాయకుడిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఇక మహిళా సభ్యులు ఎవరైనా అనారోగ్యం పాలైతే వారి చికిత్స కోసం ప్రత్యేక ప్రయోజనాలు కల్పించనున్నారు. ముఖ్యంగా బ్రెస్ట్‌ క్యాన్సర్‌, సర్వికల్‌ క్యాన్సర్‌తో బాధపడే మహిళలకు అత్యుత్తమ చికిత్స అందించనున్నట్లు వెల్లడించారు. నగరంలోని ఏఐజీ, అపోలో, కిమ్స్, మెడికవర్, సన్ షైన్ ఆస్పత్రుల్లో 50 శాతం రాయితీపై ఓపీ కన్సల్టేషన్‌తో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఉచిత అంబులెన్స్ సౌకర్యం కూడా కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే నిరంతరంగా సభ్యులు తమ ఆరోగ్యాన్ని ఈ ఆస్పత్రుల్లో ఉచితంగా పరీక్షించుకోవచ్చని వెల్లడించారు.