షాకింగ్ న్యూస్: బిగ్‏బాస్ హౌస్ నుంచి రవి ఔట్!

Shocking News: Ravi out of Bigg Boss House!

0
142

బిగ్‏బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. దీంతో టాప్ 5లో ఉంటే చాలు అనుకుంటున్నారు కంటెస్టెంట్స్. ఇక మరికొందరు ఎప్పుడు వెళ్ళిపోతాం అంటూ టెన్షన్ పడుతూ గడిపేస్తున్నారు. అయితే ఇప్పటివరకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్న యాంకర్ రవి 12 వారం నామినేషన్స్‌లో భాగంగా హౌస్ నుండి బయటకు రాబోతున్నట్లు సమాచారం.

ఓటింగ్ పరంగా చూసుకుంటే..రవి టాప్ 3లో ఉన్నాడు. లీస్ట్‌లో సిరి, ప్రియాంక, కాజల్‌లు ఉన్నారు.సిరి-ప్రియాంకలలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావచ్చనే అంచనాలను తలకిందులు చేస్తూ యాంకర్ రవిని బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించినట్టు తెలుస్తోంది. కాజల్-రవిలను చివరికి వరకూ ఉంచి..చివర్లో కాజల్‌ని సేవ్ చేసి రవిని ఎలిమినేట్ చేసినట్టుగా లీక్ బయటకు వచ్చింది. కానీ ఇది నిజమో కాదో తెలియాలంటే కొంత సమయం ఆగాల్సిందే.