చిరు, పవన్ తో స్టార్‌ డైరెక్టర్‌ సినిమా?

Chiru, star director with Pawan?

0
117

మెగా బ్రదర్స్‌ చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత ‘ గాడ్ ఫాదర్’, ‘భోళాశంకర్’ సినిమాల ఏకకాలంలో సెట్స్ మీదకు తీసుకెళ్లిన ఆయన.. కొద్ది రోజుల క్రితమే బాబీతో మరో సినిమాను ప్రకటించారు.

మారుతి, త్రివిక్రమ్ దర్శకత్వంలో కూడా చిరు సినిమాలు చేయనున్నారని ఫిల్మ్‌ నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇవి కాకుండా చిరంజీవి తాజాగా మరో దర్శకుడికి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన అనిల్ రావిపూడి. దర్శకధీరుడు తర్వాత ఇప్పటి వరకూ ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా.. సినిమాలు తెరకెక్కిస్తోన్న ఆయన మెగాస్టార్‌కు కథ వినిపించారట. చిరంజీవికి కూడా ఈ స్టోరీలైన్‌ బాగా నచ్చిందట.

కాగా ప్రస్తుతం ‘ఎఫ్ 3’ చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు అనిల్. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది పూర్తి అవ్వగానే చిరు సినిమాను పట్టాలెక్కించనున్నట్టు తెలుస్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఉందని అనిల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. పవన్‌తో ‘వకీల్‌సాబ్‌’ తీసిన దిల్‌ రాజు ఈ కాంబినేషన్‌ను సెట్‌ చేయాలని చూస్తున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.