క్యూట్ జంట..ఫేమస్ అయ్యేనంట..!

Cute couple .. to become famous ..!

0
100

ఇక్కడ కనిపిస్తున్న జంటను చూస్తే ఇదేదో పిల్లల పెళ్లి సరదాకు చేశారు అనుకుంటే మీరు పొరపడినట్లే. చూడడానికి చిన్నవారిలా కనిపిస్తున్న వీరిద్దరి వయస్సు పాతికేళ్ల పైనే. శరీరం పెరుగుదల మందగిస్తేనేం మాకు ప్రేమించే హృదయం ఉందంటూ ఈ జంట ఒక్కటై అందరికి ఆదర్శంగా నిలిచారు.

బెంగళూరుకు చెందిన విష్ణు (28), కోలారుకు చెందిన వధువు జ్యోతి (26) బెంగళూర్ లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వారిద్దరిలో శరీర పెరుగుదల మందగించింది. అయితేనేం ఆత్మ విశ్వాసం మాత్రం తగ్గలేదు. ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. వారు అనుకున్నట్టుగానే వివాహంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం చింతామణి దగ్గరున్న కైవార క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు ఈ జంట ఫోటోలు సోషల్ మీడియా తెగ వైరల్ అవుతున్నాయి. ఈ జంటను చూసిన ప్రతి ఒక్కరు వావ్ వాట్ ఏ కపుల్ అంటూ తెగ మెచ్చుకుంటున్నారు. ఈ జంట గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.

ప్రస్తుత కాలంలో ఇటువంటి ప్రేమ పెళ్లిళ్లు జరగడం చాలా అరుదు. అందంగా ఉండి ప్రేమించుకున్న వాళ్లే ఎన్నో కారణాలతో పెళ్లి చేసుకోలేకపోతుంటే..శరీర పెరుగుదల అంతంత మాత్రమే ఉన్న ఈ జంట వివాహం చేసుకొని అందరిచేత ప్రశంసలు పొందుతున్నారు.