కంటతడి పెట్టిస్తున్న సిరివెన్నెల చివరి ఫోన్ కాల్..

Sirivennela's last phone call in tears ..

0
75

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మూడున్నర దశాబ్దాల పాటు వెల్లివిరిసిన సిరివెన్నెల మాయమైంది. తెలుగు పాటకు వన్నె తెచ్చిన సీతారామశాస్త్రి గారు ఇక లేరు. అనారోగ్యంతో ఆయన అకాల మరణం చెందారు.

కాగా సిరివెన్నెల సీతారామశాస్త్రి చివరి సారిగా మాట్లాడిన మాటలు అందరినీ కదిలిస్తున్నాయి. డైరెక్టర్ కూచిపూడి వెంకట్‌తో చివరకి సారిగా ఫోన్‌లో మాట్లాడారు. మణికొండలో కూతురు ఇంట్లో ఉన్నట్టు తనకు లంగ్ ఆపరేషన్ ఫిక్స్ అయినట్లు తెలియజేశారు. వాసు సినిమా రాయాల్సి ఉంది. కానీ రెండు నెలలు రాయలేనన్నారు.

డిసెంబర్ నెల అంతా పోస్ట్ ఆపరేషన్ రెస్ట్‌లోనే ఉంటానని చెప్పుకొచ్చారు. తిరిగి జనజీవన స్రవంతిలోకి వచ్చాక పాట రాస్తానన్నారు. మళ్లీ ఆరోగ్యంగా తిరిగొస్తాననే నమ్మకం కావొచ్చు. తన ఆరోగ్య పరిస్థితిపై నవ్వుతూ సరదాగానే మాట్లాడారు. కానీ అంతలోనే ఆయన వెన్నెలలో కలిసిపోయారు.