తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య..ధాన్యం కుప్ప వద్దే..

0
94

తెలంగాణలో మరో రైతు తనువు చాలించాడు. పంట పండించడం ఒకవైపు అయితే పంట అమ్మడం పెనుభారంగా మారిందంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది.

ఏటూరునాగారం మండలం శివపురంకు చెందిన కుమార్ అనే రైతు కొనుగోలు కేంద్రంలో వడ్లు పోశాడు. 10 రోజులుగా ధాన్యం రాశుల వద్ద కాపలా ఉన్నాడు. ఇన్ని రోజులు అయినా ధాన్యం కొనట్లేదనే బెంగతో ధాన్యం కుప్ప వద్దే పురుగుల మందు తాగాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతి చెందాడు. అతని మృతితో గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి.