యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కరోనా నుంచి కోలుకున్నారు. కమల్ ప్రస్తుతం కోవిడ్ నుంచి పూర్తి కోలుకున్నారని..ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తాజాగా ఆయన ఆరోగ్య పరసిత్థిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
ఇటీవల అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాత కమల్ స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పరీక్షలు చేయించుకోగా.. కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని కమల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.దీంతో వైద్యుల సమక్షంలో వారి సూచనలు.. చికిత్స తీసుకుంటూ క్యారంటైన్లో ఉన్నట్లు కమల్ తెలిపారు.
ఇక తాజాగా విడుదలైన కమల్ హెల్త్ బులెటిన్లో ఆయన పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నట్లుగా తెలిపారు. డిసెంబర్ 3న అతడిని డిశార్జ్ చేయనున్నామని.. డిసెంబర్ 4 నుంచి కమల్ తన పనులు చేసుకోవచ్చని తెలిపారు. కమల్ హాసన్ పూర్తిగా రెండు టీకాలు వేసుకున్నప్పటికీ కరోనా భారీన పడ్డారు. ఈ విషయం పై వైద్యులు గతంలోనే క్లారిటీ ఇచ్చారు. విడ్ రెండు టీకాలు వేసుకోవడం ద్వారా సీరియస్ కండీషన్..చనిపోయే ప్రమాదం తగ్గి్స్తాయని..పూర్తిగా వ్యాక్సినేటేడ్ వ్యక్తులకు కూడా కరోనా వస్తుందని తెలిపారు.