బిగ్ బాస్ సీజన్ 5లో అదిరిపోయే ట్విస్ట్..రీఎంట్రీ ఇవ్వనున్న ఆ కంటెస్టెంట్

The contestant who will give a re-entry in the Bigg Boss Season 5 twist

0
109

బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. టాప్ 5లో ఎవరు ఉంటారు.. విన్నర్ ఎవరు అవుతారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు బిగ్ బాస్ గేమ్ షోలో జరగని విశేషాలు ఈ సీజన్ లో జరుగుతున్నాయి. అలాగే యాంకర్ రవి ఎలిమినేషన్ తో షోలో ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.

అయితే గత సీజన్స్ లో సీక్రెట్ రూమ్ లో పెట్టి గేమ్ ఆడారు కానీ ఈ సారి అది జరగలేదు. అలాగే వైల్డ్ కార్డు ఎంట్రీ కూడా జరగలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎలిమినేట్ అయ్యి బయకు వెళ్లిన ఓ కంటెస్టెంట్ తిరిగి హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని అంటున్నారు. ఆ కంటెస్టెంట్ ఎవరో కాదు యాంకర్ రవి.

రవి హౌస్ నుంచి బయటకు రావడం చాలా నాటకీయంగా జరిగింది. ఊహించని విధంగా రవి ఎలిమినేషన్ జరిగింది. ఓట్లు తక్కువచ్చాయన్న కారణంగా రవిని ఎలిమినేట్ చేశారు. రవి ఎలిమినేట్ అని ప్రకటించిన వెంటనే బిగ్ బాస్ షో నిర్వహిస్తున్న అన్నపూర్ణ దగ్గర రవి అభిమానులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. అయితే ఎలిమినేషన్ సమయంలో రవిలో ఎలాంటి ఆందోళన కనిపించలేదు.. మిగిలిన హౌస్ మేట్స్ షాక్ అయినా కూడా రవి మాత్రం ఏ ఎమోషన్ లేకుండా కనిపించాడు.

ఇక ఇప్పుడు రవి రీఎంట్రీ ఇవ్వనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. బిగ్ బాస్ తెలుగు చరిత్రలో ఇది కొత్తేమి కాదు గత సీజన్స్ లో ఇలా పలువురు బయటకు వెళ్లి తిరిగి హౌస్ లోకి వచ్చారు.  సీజన్ 2 యాంకర్ శ్యామల, నూతనయుడు, అలీ రెజా లాంటి వారు ఇప్పుడు రవి రీ ఎంట్రీ ఇస్తే అతనే విన్నర్ అవుతాడని అభిమానులు అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..