తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఓవైపు ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనకు గురి చేస్తుండగా.. క్రమంగా కరోనా కేసులు పెరుగుతుండటం కలకలం రేపుతోంది. కాగా విదేశాల నుంచి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన 12 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది.
యూకే, కెనడా, అమెరికా, సింగపూర్ నుంచి వచ్చిన 12 మందికి పాజిటివ్‌గా తేలింది. యూకే నుంచి వచ్చిన 9 మందికి..అమెరికా, కెనడా, సింగపూర్ నుంచి వచ్చిన ముగ్గురికి వైరస్ సోకినట్లుగా పరీక్షల్లో వెల్లడైంది. గురు, శుక్ర వారాల్లో విదేశాల నుంచి వచ్చిన 12 మందికి వైరస్ సోకినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.