తెలంగాణలో పరువు హత్య..కన్న కూతురిని కడతేర్చిన కసాయి తల్లి

Defamation murder in Telangana..the mother who molested her younger daughter

0
107

తెలంగాణలో ఘోరం జరిగింది. కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే బిడ్డను కాటికి పంపింది. వేరే కులం యువకుడిని ప్రేమించిందని కర్కశంగా వ్యవహరించింది. పరువు కోసం కన్న బిడ్డను గొంతు నులిమి దారుణంగా చంపేసింది. ఆపై హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కానీ పోలీసుల విచారణలో నిజం నిగ్గు తేలింది.

వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో గత నెల 19వ తేదీన అంజలి అనే 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పర్వతగిరికి చెందిన ఉబ్బని సమ్మక్కకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెకు గతంలోనే వివాహమైంది. అయితే పదో తరగతి చదువుతున్న చిన్న కుమార్తె అంజలి(17).. అదే గ్రామానికి చెందిన రాయపురం ప్రశాంత్‌తో ప్రేమలో పడింది. పరాయి యువకుడితో ప్రేమలో ఉందన్న విషయం తల్లికి తెలియడంతో కూతురిని పలుమార్లు మందలించింది.

అయినా అంజలిలో మార్పు రాలేదు. వారిద్దరు పెళ్లి చేసుకుంటే తమ పరువు పోతుందని భావించిన సమ్మక్క తన తల్లి యాకమ్మతో కలిసి గత నెల 19న అర్ధరాత్రి అంజలి గాఢనిద్రలో ఉండగా ముఖంపై దిండు ఉంచి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. కాగా పోలీసుల విచారణలో కులాంతర వివాహం చేసేందుకు ఇష్టం లేకనే అంజలిని హత్య చేశామని విచారణలో మృతురాలి తల్లి సమ్మక్క, అమ్మమ్మ యాకమ్మలు ఒప్పుకున్నారు.

కన్న బిడ్డను కాటికి పంపి కటకటాల పాలయింది ఆ తల్లి. పరువు కోసం ప్రేగు తెంచుకొని కన్న బిడ్డను చంపడానికి  వెనుకాడలేదు ఈ కసాయి తల్లి. ఇలాంటి దారుణాలు ఎన్నో జరుగుతున్న వెలుగులోకి వచ్చేవి కొన్నే.