ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రస్తుతం రోశయ్య పార్థివదేహం బంజారాహిల్స్ లోని స్టార్ ఆసుపత్రిలో ఉంది.
అక్కడినుండి పార్ధివదేహాన్ని అమీర్ పేటలోని ఆయన నివాసానికి తరలించనున్నారు. ఈరోజు నివాసంలోనే పార్ధివదేహాన్ని ఉంచనున్నట్టు సమాచారం. రేపు ఉదయం 11 గంటలకు రోశయ్య పార్ధివదేహాన్ని కాంగ్రెస్ కార్యకర్తల సందర్శనార్ధం గాంధీభవన్ కు తరలించనున్నారు. తదనంతరం మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ విషయాలను కాంగ్రెస్ నేత కెవిపి రామచంద్రరావు మీడియాకు తెలిపారు.