దేశంలో కరోనా పాజిటివ్ కేసుల్లో మరోసారి హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. అయితే, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా లక్షకు చేరువగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మొత్తం కేసులు: 3,46,33,255
మొత్తం మరణాలు: 4,73,326
యాక్టివ్ కేసులు: 99,155
మొత్తం కోలుకున్నవారు: 3,40,60,774
కొవిడ్ మరణాల లెక్కలు సవరించాక బిహార్లో 2,426, కేరళలో 263 మృతులతో మరణాల సంఖ్య భారీగా పెరిగింది. దేశంలో కొవిడ్ కేసులు 50 వేల కంటే తక్కువగా నమోదుకావటం వరుసగా ఇది 161వ రోజు అని కేంద్రం తెలిపింది. యాక్టివ్ కేసుల సంఖ్య.. మొత్తం కేసుల్లో 0.29 శాతం ఉన్నట్లు పేర్కొంది.
పెరిగిన మరణాల రేటు..