Flash News- గుడ్ న్యూస్..ఆ మహిళకు ఒమిక్రాన్‌ నెగెటివ్‌

Good news..Omicron negative for that woman

0
93

ఓవైపు ఒమిక్రాన్ వేరియంట్ ఆందోళనకు గురిచేస్తుండగా.. క్రమంగా కరోనా కేసులు పెరుగుతుండటం కలకలం రేపుతోంది. ఇదిలా ఉండగా బ్రిటన్ నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ రావడం వల్ల అనుమానంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జినోమ్ సీక్వెన్స్​కు నమూనాలు పంపించారు.

జినోమ్ నివేదికలో ఒమిక్రాన్ నెగెటివ్​ వచ్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. బ్రిటన్ నుంచి వచ్చిన ఆమెకు కరోనా రావడంతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. ఒకవేళ ఒమిక్రాన్ అని తేలితే హైదరాబాద్​లో కొన్ని ఆంక్షలు విధించాలని సర్కార్ యోచించినట్టు తెలుస్తుంది.