ఏపీలోని అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుమ్మగట్ట మండలం పూలకుంట వద్ద జీపు..ఆటోను ఢీ కొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాయదుర్గం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.