ఏపీలో లేఅవుట్స్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. కొత్త లేఔట్స్‌లో 5 శాతం భూమి ప్రభుత్వానికి ఇవ్వాలని నిబంధన తెచ్చింది. భూమి ఇవ్వకుంటే దానికి సమానమైన విలువకి డబ్బులు కట్టాలాని జీవో రిలీజ్ చేసింది ప్రభుత్వం.
ఒకవేళ లేఅవుట్ లో భూమి తక్కువ అయితే లేఅవుట్ కి 3 కిలోమీటర్ల పరిధిలో భూమి కొని ఇవ్వాలనే రూల్ తీసుకొచ్చింది. లేఅవుట్స్ లో తీసుకున్న 5 శాతం భూమిని వైస్సార్ జగనన్న కాలనీల ద్వారా పేదలకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ లక్ష్మి.. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.