తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్ గానే ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయో ఎవరం ఊహించలేము. తాజాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలిశారు. చెన్నైలోని పొయెస్ గార్డెన్ లో ఉన్న రజనీ నివాసానికి వచ్చిన శశికళ ఆయనతో భేటీ అయ్యారు.
రజనీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం పట్ల రజనీని ఆమె అభినందించారు. కాగా, ఇది మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశమేనని శశికళ ప్రతినిధులు వెల్లడించారు.