ఏపీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. డ్యూటీలో చేరి చాలా 15 ఏళ్లు అవుతోన్నా ప్రమోషన్ రాలేదన్న ఆవేదనతో ఓ ఎస్‌ఐ తన ప్రాణాలనే తీసుకున్న సంఘటన కలకలం రేపింది. దీంతో ఈ అంశం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కర్నూలుకు చెందిన రాఘవ రెడ్డి ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. 1991 బ్యాచ్‌కు చెందిన రాఘవ రెడ్డికి ఇప్పటి వరకు ఒక్క ప్రమోషన్ కూడా రాలేదు. తన బ్యాచ్‌కి చెందిన వారంత మాత్రం డీఎస్పీలుగా పదోన్నది పొందారని తాను మాత్రం ఇంకా అక్కడే ఉన్నానని మదనపడుతుండే వాడు.
ఈ క్రమంలోనే ఈ ఆవేదనకు తోడుగా కొన్ని కుటుంబ సమస్యలకు కూడా చేరడంతో మంగళవారం కొట్టాల సమీపంలో ఉన్న తన అపార్టుమెంట్‌లో మద్యంలో పురుగుల మందు కలిపి తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించగా పురుగుల మందు సేవించిన కొద్ది క్షణాల్లోనే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు పూర్తి కారణాలు ఏంటన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.