సిరివెన్నెల చివరి పాట..హీరోయిన్ సాయిపల్లవి ఎమోషనల్ ట్వీట్

Sirivennela last song..heroine saipallavi emotional tweet

0
88

ప్రముఖ సినీ గేయ రచయిత సిరి వెన్నెల సీతారామశాస్త్రి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. 1986లో ‘సిరివెన్నెల’చిత్రంతో ప్రారంభమైన ఆయన పాటల ప్రయాణం.. ‘శ్యామ్‌ సింగరాయ్‌’తో ముగిసింది.

నాని కథానాయకుడిగా తెరకెక్కుతున్న సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రంలో సిరివెన్నెల రెండు పాటలు రాశారు. అందులో ఆయన రాసిన చివరి పాటను మంగళవారం విడుదల చేసింది చిత్ర బృందం. ఇదే ఆయన రాసిన ఆఖరి పాట అని చిత్ర బృందం వెల్లడించింది. ‘ సిరివెన్నెల’ అంటూ సాగడం ఈ పాట ప్రత్యేకత. నేడు ఈ పాటను విడుదల చేశారు శ్యామ్‌ సింగరాయ్‌ మూవీ యూనిట్‌.

ఈ నేపథ్యంలో సిరివెన్నెల రాసిన ఈ చివరి పాటపై స్పందిస్తూ ఎమోషనల్‌ పోస్ట్‌ షేర్‌ చేసింది సాయి పల్లవి.  ‘మీరు రాసిన ప్రతి పదం మీ ఆత్మను తీసుకు వస్తోంది. ఎప్పటికీ మీరు మా హృదయాల్లో జీవించే ఉంటారు సార్‌’ అంటూ సాయి పల్లవి ఎమోషనల్‌ అయ్యింది. ఈ పాట సినిమాకి హైలైట్‌గా నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.  ‘నెల రాజునీ .. ఇల రాణిని కలిపింది కదా సిరివెన్నెల’ అంటూ సాగే ఈ పాట బాగా ఆకట్టుకుంటోంది.

https://twitter.com/Sai_Pallavi92