రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ ఇంట్లో దొంగల హల్ చల్

Retired bank manager hull hull in the house

0
89

ఏపీలో దొంగలు హల్ చల్ చేశారు. తిరుపతిలోని రిటైర్డ్ బ్యాంకు మేనేజర్ ఇంట్లో దొంగలు 52 గ్రాముల బంగారం, లక్షకు పైగా వెండి సామాగ్రి అపహరించారు. దీనితో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

వివరాల్లోకి వెళితే..తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రఘునాథ రిసార్ట్స్ తేజశ్రీ అపార్ట్మెంట్ 505 లో ప్రసన్న కుమార్ తన భార్యతో ఉంటున్నాడు. మూడు రోజుల క్రితం పని నిమిత్తం హైదరాబాద్ కు వెళ్లి నేడు తిరుపతికి వచ్చాడు. అతను వచ్చేసరికి తలుపులు బద్దలుకొట్టి బీరువా తలుపులు తెరిచి ఉండడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సంఘటనా స్థలానికి తిరుచానూరు పోలీసులు క్లూస్ టీం చేరుకొని ఆధారాలు సేకరించారు. అలాగే ఆ దొంగలు అపార్ట్ మెంట్ లో ఉన్న సీసీ కెమెరాల నిక్షిప్త హార్డ్ డిస్క్ ను తీసుకెళ్లారు.బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తిరుచానూరు ఎస్ ఐ రామకృష్ణారెడ్డి దర్యాప్తు చేస్తున్నారు.