భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్ తన కుటుంబంతో కలిసి ప్రయణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ Mi-17V-5 తమిళనాడులోని నీలగిరి కొండల్లో కుప్పకూలిన సంగతి తెలిసిందే. హెలికాప్టర్ చెట్టుకు ఢీకొనడం, ఆతర్వాత మంటలు చేలరేగడంతో మొత్తం 11 మంది మృత్యువాత పడ్డారు.
ఈ ప్రమాదంలో బిపిన్ రావత్‌తో పాటు ఆయన సతీమణి తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇక ప్రమాదానికి గురైన ఆర్మీ హెలికాప్టర్ Mi-17V-5 విషయానికొస్తే…ఇది Mi-8-17 కుటుంబానికి చెందిన మిలిటరీ రవాణా విమానం. రష్యాకు చెందిన కాజాన్ హెలికాప్టర్స్ దీనిని తయారు చేసింది. ప్రపంచంలోనే అత్యాధునిక రవాణా హెలికాప్టర్‌గా Mi-17V-5 పేరుంది. భద్రతా బలగాల రవాణాకు, అగ్ని ప్రమాదాల కట్టడికి, కాన్వాయ్ ఎస్కార్టుగా, పెట్రోలింగ్ విధులు, గాలింపు చర్యలు తదితర ఆర్మీ ఆపరేషన్స్‌లో విరివిగా దీనిని ఉపయోగిస్తారు. ఇందులో మొత్తం ముగ్గురు సిబ్బందితో కలిసి 39 మంది ప్రయాణించవచ్చు.
Mi-17V-5 లో FLIR సిస్టంతో పాటు అత్యవసర సమయాల్లో సహకరించే ఫ్లోటేషన్ సిస్టమ్స్ సదుపాయం ఉంది. ఇది సుమారు 4, 500 కిలోల బరువు వరకు మోసుకెళ్లగలదు. ఇక శత్రువుల దాడుల నుంచి రక్షణ పొందేందుకు S-8 రాకెట్లు, 23 mm మెషిన్ గంటి అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను కలిగి ఉంది.