బిపిన్ రావత్ నోట చివరి మాట..ఆయన అడిగింది ఇదే!

Bipin Rawat's view is the last word..what did he ask?

0
71

తమిళనాడులోని కూనూరు వద్ద ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ హెలికాప్టర్ లో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన కుటుంబసభ్యులు, ఉన్నతాధికారులు మొత్తం 14 మంది దుర్మరణం చెందారు.

అయితే హెలికాప్టర్‌ ప్రమాదంలో చిక్కుకొని తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న బిపిన్‌ రావత్‌ తనను నీళ్లు కావాలని అడిగారని శివకుమార్‌ అనే వ్యక్తి మీడియాకు తెలిపారు. అయితే, ఏటవాలు ప్రాంతంలో ఆయన పడి ఉండడంతో సత్వరం రక్షించేందుకు వీలు కాలేదని చెప్పారు. ఆయన అంత పెద్ద మనిషి అని అప్పుడు తెలియలేదని.. ఆ తర్వాత ఎవరో ఫొటో చూపించినప్పుడు తెలిసిందన్నారు.

తలుచుకుంటే బాధనిపిస్తోందని, ఆ రోజు రాత్రంతా నిద్రపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శివకుమార్‌ స్థానిక కాంట్రాక్టరు. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ రావత్‌ దంపతులు సహా 13 మందిని బలిగొన్న హెలికాప్టర్‌ ప్రమాదానికి ఆయన ప్రత్యక్ష సాక్షి. కాగా, బిపిన్‌ రావత్‌ చివరి క్షణాల్లో హిందీలో మాట్లాడారని, ‘నేనే బిపిన్‌ రావత్‌ని’ అంటూ నెమ్మదిగా పలికారని సహాయక చర్యల్లో పాల్గొన్న అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు.