స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అలర్ట్. ఇంటర్నెట్ సేవలకు శనివారం కొద్ది గంటల పాటు అంతరాయం ఏర్పడనుంది. ఈ సమయంలో ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలతో పాటు యోనో, యోనో లైట్, యూపీఐ సేవలు సైతం నిలిచిపోతాయని ఎస్‌బీఐ తెలిపింది.
శనివారం రాత్రి 11.30 గంటల నుంచి ఆదివారం వేకువజామున 4.30 వరకు (300 నిమిషాలు) ఈ సేవలు నిలిచిపోనున్నట్లు ఎస్‌బీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. టెక్నికల్ అప్‌గ్రేడేషన్ ప్రక్రియలో భాగంగా సేవలకు అంతరాయం ఏర్పడుతోందని ఎస్బీఐ పేర్కొంది.
మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించే ఈ ప్రయత్నంలో కలుగుతున్న అసౌకర్యానికి సహకరించాలని కస్టమర్లను కోరింది. దేశ వ్యాప్తంగా ఎస్బీఐకి 22 వేల శాఖలు, 57,889 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. అక్టోబర్ 8న ఇదే తరహాలో మెయింటెనెన్స్‌లో భాగంగా ఎస్బీఐ ఇంటర్నెట్ సేవలకు కొద్దిగంటల పాటు అంతరాయం ఏర్పడింది.