తెలంగాణ: ఉప్పల్ అబాకస్ ఐటి పార్క్‌లో సాలిగ్రామ్ & టెక్ స్మార్ట్ ఐటి కంపెనీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ..హైదరాబాద్ నగరం నలువైపులా ఐటి పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఉప్పల్ అబాకస్ ఐటి పార్క్‌లో సాలిగ్రామ్ & టెక్ స్మార్ట్ ఐటి కంపెనీ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ..ఐటీ రంగాన్ని హైదరాబాద్ లో అన్ని వైపులా విస్తరించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీ తీసుకొచ్చిందన్నారు. అందులో భాగంగా ఉప్పల్ కారిడార్ లో అనేక ఐటీ పరిశ్రమలు నెలకొల్పుతుండటంపై ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు. ఐటీ పరిశ్రమలు నెలకొల్పే దిశగా మంత్రి కేటీఆర్ యువతను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారన్న ఎమ్మెల్సీ కవిత, హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో దేశంలో నెంబర్ వన్ గా నిలిచిందన్నారు.
కంపెనీ స్థాపించి అనేక మంది యువతకు ఉపాధి కల్పిస్తున్న సాలిగ్రామ్ & టెక్ స్మార్ట్ ఐటి కంపెనీ యాజమాన్యాన్ని ఎమ్మెల్సీ కవిత అభినందించారు. ఈ రోజు ప్రారంభించిన కొత్త కంపెనీలో దాదాపు 300 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.