నేడు తమిళనాడుకు సీఎం కేసీఆర్‌..స్టాలిన్​తో కీలక భేటీ

Key meeting with CM KCR Stalin in Tamil Nadu today

0
97

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ కుటుంబ సమేతంగా తమిళనాడు పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా శ్రీరంగంలోని రంగనాథస్వామి వారిని దర్శించుకుంటారు. మంగళవారం రోజు సీఎం కేసీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్​తో భేటీ అవుతారని తెలిసింది.

తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్… తమిళనాడు పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. నేడు ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ తిరుచిరాపల్లి వెళతారు. అనంతరం రోడ్డు మార్గంలో వెళ్లి మధ్యాహ్నం తర్వాత రంగనాథస్వామిని దర్శించుకుని, విమానాశ్రయానికి తిరుగుప్రయాణమవుతారు. అక్కడి నుంచి చెన్నైకి చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు. మంగళవారం ఉదయం స్టాలిన్​తో సమావేశమవుతారని సమాచారం.

కేంద్ర ప్రభుత్వ ధోరణిని ఎండగట్టడంతో పాటు పంటలకు మద్దతు ధరలపై విధాన నిర్ణయాన్ని వెల్లడించేలా ఒత్తిడి తెచ్చేందుకు ఇతర రాజకీయ పార్టీల మద్దతు సమీకరించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన స్టాలిన్​తో చెన్నైలో భేటీ కానున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా భాజపా వ్యతిరేక కూటమి పైనా చర్చించే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అలాగే మార్చి 28న జరగనున్న యాదాద్రి ఆలయ మహాకుంభ సంప్రోక్షణకు ఆహ్వానిస్తారు. గత లోక్​సభ ఎన్నిక ముందు 2010 మే నెల 13న కేసీఆర్ శ్రీరంగం వెళ్లి ఆ తర్వాత అప్పటి డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్​తో భేటీ అయ్యారు. అప్పట్లో ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించారు.