ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూస్తున్న పీఆర్సీపై ప్రభుత్వం ఓ ప్రకటన చేయనుంది. దీనిపై పది రోజుల్లో ప్రకటన చేయనున్నామని స్వయంగా సీఎం జగన్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇక, అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. ఇప్పటికే పీఆర్సీ ఎంతివ్వాలనే దానిపై కమిటీ ఓ నివేదిక తయారు చేసింది. మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు పీఆర్సీ కమిటీ తుది నివేదిక ఇవ్వనుంది. అనంతరం సీఎం జగన్ పీఆర్సీపై కీలక ప్రకటన చేయనున్నారు.
ఇదిలా వుంటే. తాజాగా పీఆర్సీ విషయంలో ఉద్యోగ సంఘాల మధ్య ఆసక్తికరమైన చర్చ కొనసాగుతోంది. 2018 జులై 01వ తేదీ నుంచి పీఆర్సీ సిఫార్సులను అమలు చేయాలని, 55 పర్సంటేజీ ఫిట్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరి సీఎం జగన్ ఎలాంటి ప్రకటన చేస్తారనే ఉత్కంఠ నెలకొంది.