తెలంగాణలో ఈ నెల10వ తేదీన నిర్వహించిన ఎమ్మెల్సీ పోలింగ్ ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లాలో 2, ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరిగింది.
ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో తెరాస అభ్యర్థి తాత మధు గెలుపొందారు. ఖమ్మంలో తెరాసకు 480, కాంగ్రెస్ 242, స్వతంత్ర అభ్యర్థికి 4 ఓట్లు పడ్డాయి. ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంలో 12 చెల్లని ఓట్లు ఉన్నాయి. అలాగే నల్గొండ ఎమ్మెల్సీ స్థానం, మెదక్ ఎమ్మెల్సీ స్థానంలో తెరాస విజయం సాధించింది.
ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి 691 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.
మొత్తం ఓట్లు 1233.
చెల్లిన ఓట్లు 1183.
చెల్లని ఓట్లు 50.
గెలుపు కోటా 593.
టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డికి పడ్డ ఓట్లు 917.
స్వతంత్ర అభ్యర్థి నగేష్ కు 226.
టీఆర్ఎస్ కోటిరెడ్డి మెజార్టీ 691 ఓట్లు.
మెదక్ ఎమ్మెల్సీ స్థానంలో తెరాస అభ్యర్థి యాదవరెడ్డి గెలుపొందారు.
మెదక్: తెరాస 762, కాంగ్రెస్ 238, స్వతంత్ర అభ్యర్థికి 6 ఓట్లు
మెదక్ ఎమ్మెల్సీ స్థానంలో చెల్లని ఓట్లు 12గా ఉన్నాయి.