Breaking- సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబుకు సర్జరీ

0
72

సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబుకు సర్జరీ జరిగింది. స్పెయిన్‌లో మహేష్ బాబు మోకాలికి ఆపరేషన్‌ జరగగా, ప్రస్తుతం దుబాయ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు న‌టిస్తున్న చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌’. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. కాగా.. ఈ చిత్ర షూటింగ్‌లోనే మ‌హేష్ మోకాలికి చిన్న గాయం అయింది. దీంతో గ‌త కొద్ది రోజులుగా ఆయ‌న తీవ్ర‌మైన నొప్పితో బాధ‌ప‌డుతున్నార‌ట‌. దానితో మహేష్ బాబుకు సర్జరీ చేయడం జరిగింది.

మహేశ్‌కు సర్జరీ జరగడం వల్ల ఆయన లేని సన్నివేశాలను సర్కారు వారి పాట చిత్రబృందం తెరకెక్కిస్తోంది. ఫిబ్రవరి నుంచి మహేశ్‌ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందని ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా ఏప్రిల్‌ 1, 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోలు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ సినిమా తర్వత మహేష్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.