పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే నెల నుంచి వృద్దాప్య పెన్షన్ రూ. 2250 నుంచి రూ. 2500 పెంచుతున్నట్లు తెలిపింది. నూతన సంవత్సరం వేళ జనవరి 1, 2022 నుంచి ఇది అమలు కానుందని స్పష్టం చేసింది.
డిసెంబర్, జనవరిల్లో ఈ కార్యక్రమాలు చేపట్టనున్నారు. డిసెంబర్ 21న సంపూర్ణ గృహహక్కు పథకం. డిసెంబర్ 28న ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత చేపట్టిన వివిధ పథకాలు, కార్యక్రమాల కింద పొరపాటున మిగిలిపోయిన లబ్ధిదారులకు ప్రయోజనాల పంపిణీ జనవరి 1, 2022న న పెన్షన్‌కానుక కింద పెన్షన్లు రూ.2,500కు పెంపు జనవరి 9న ఈబీసీ నేస్తం అమలు. అగ్రవర్ణాల్లోని నిరుపేద మహిళలకు (45–60ఏళ్లు) 3 ఏళ్లలో రూ.45 వేలు. జనవరిలోనే రైతు భరోసా ఇస్తాం అంటూ సీఎం జగన్ స్పష్టం చేశారు.