రానున్న ఆరు నెలల్లో చిన్నారుల కోసం కొవిడ్ టీకాను తీసుకురానున్నట్లు సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా వెల్లడించారు. ఓ సదస్సులో మాట్లాడిన ఆయన పిల్లలకు కొవిడ్ నుంచి రక్షణ కల్పించే కొవొవాక్స్ టీకా క్లినికల్ ట్రయల్స్ దశలో ఉందని వివరించారు.
3 ఏళ్లు పైబడ్డ పిల్లలందరికీ ఈ టీకాను ఇవ్వవచ్చని తెలిపారు. ప్రస్తుతం సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్‌ను 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఇస్తున్నారు. అదృష్టవశాత్తు చిన్నారుల్లో కొవిడ్ తీవ్రమైన అనారోగ్యం కలిగించడం లేదని పునావాలా అన్నారు.
ఇప్పటికే భారత్‌లో రెండు కంపెనీలకు చెందిన కొవిడ్ టీకాలు చిన్నారులకు ఇచ్చేందుకు అనుమతి పొందినట్లు గుర్తు చేశారు. చిన్నారులకు టీకా వేయించాలనుకునే వారు ప్రభుత్వ ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందేనని స్పష్టం చేశారు పూనావాలా.