ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్‌కు కరోనా పాజిటివ్ గా తేలింది. మంగళవారం నిర్వహించిన పరీక్షల్లో అతనికి కరోనా సోకినట్లు తెలిసింది. గత శుక్రవారం సిడ్నీ పాఠశాల వేడుకకు మారిసన్ హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి 1000 మంది హాజరయ్యారు. ఇప్పుడు ప్రధాన మంత్రికి కరోనా సోకడంతో ఆ 1000 మందిలో ఆందోళన నెలకొంది. వ్యాధి సోకడానికి ముందు పాఠశాల కార్యక్రమానికి ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి హాజరై, దక్షిణ కొరియా అధ్యక్షుడిని కూడా కలిశారు. పాఠశాల కార్యక్రమంలో బాలుర బృందంతో ప్రధాని ఫోటో దిగారు. దీనితో వారిలోనూ ఆందోళన నెలకొంది.