కాంగ్రెస్ విజయం సాధిస్తుందనడానికి ఇదే నిదర్శనం: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

This is a testament to the success of the Congress: PCC chief Rewanth Reddy

0
107

స్థానిక సంస్థల మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి పోటీ ఇచ్చిందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు రాయల నాగేశ్వర్ రావ్ (ఖమ్మం), మెదక్ అభ్యర్థి నిర్మలా జగ్గారెడ్డిలను రేవంత్ రెడ్డి అభినందించారు.

అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలు పెట్టినా..ఎంత అధికార దుర్వినియాగం చేసినా బెదిరింపులకు పాల్పడ్డ కూడా కాంగ్రెస్ పోటీ తగ్గలేదు. ఎన్నికల్లో పోటీ చేసి మా ఓట్లను మేము సాధించుకున్నాం. అంతేకాకుండా అదనంగా ఓట్లు సాధించి అధికార టిఆర్ఎస్ పైన ఉన్న ప్రజా వ్యతిరేకతను బయటపెట్టామని ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వం ఎన్ని రకాలుగా అధికార దుర్వినియోగం చేసినా కూడా మా స్థానిక సంస్థలు నేతలు పట్టుదలతో ఉండి చిత్తశుద్ధితో ఎన్నికల పోరాటం చేశారు. వారందరికి అభినందనలు. ఇది రాబోయే రోజుల్లో మా పోరాటానికి మంచి స్ఫూర్తిని ఇచ్చింది. సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గట్టిగా పోరాడి విజయం సాధిస్తారని చెప్పడానికి ఇదే నిదర్శనం అని రేవంత్ రెడ్డి అన్నారు.