సొంత చెల్లిని పెళ్లి చేసుకున్న అన్న..ఎందుకంటే?

Anna who married her own sister..because?

0
94

సొంత చెల్లినే వివాహం చేసుకున్నాడు ఓ అన్న. ఈ పెళ్లి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సామూహిక వివాహాల్లో జరగడం గమనార్హం. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ ఫిరోజాబాద్​లో జరిగింది. టుండ్ల బ్లాక్​ పరిధిలో సీఎం సామూహిక వివాహల కార్యక్రమం జరిగింది. ఇందులో 51 జంటలు వివాహం చేసుకున్నాయి.

అయితే వీరందరికీ పెళ్లి ఖర్చులను ప్రభుత్వమే భరించింది. గృహోపకరణాలు, దుస్తులను కానుకగా కూడా ఇచ్చింది. అయితే ఈ పెళ్లిలో అన్న చెల్లెల వివాహ ఫొటోలు స్థానికంగా ప్రచారం కాగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ అన్న, చెల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.