Home మూవీస్ తగ్గేదేలే అంటున్న ‘ఆర్ఆర్ఆర్’ టీం..ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ స్కెచ్..!

తగ్గేదేలే అంటున్న ‘ఆర్ఆర్ఆర్’ టీం..ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ స్కెచ్..!

The 'RRR' team is saying that it is declining..a huge sketch for the pre-release event ..!

0
193

‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్​ లో తగ్గేదేలే అంటున్నారు చిత్రబృందం. అందుకు తగ్గట్లుగానే చిత్రదర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్​చరణ్, ఎన్టీఆర్.. ఈ మధ్య ముంబయి, చెన్నై, బెంగళూరులో పర్యటించి ప్రచారంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ముంబయిలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్​కు ప్లాన్ చేస్తున్నారు.

ఈ ఈవెంట్​ డిసెంబరు 19న జరగనుందని సమాచారం. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్టార్ హీరో సల్మాన్​ఖాన్, దర్శకనిర్మాత కరణ్​ జోహార్​ను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఇందులో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు.

అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్ల బడ్జెట్​తో నిర్మించారు. ఇప్పటికే బాహుబలి సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన జక్కన్న మరోసారి ఆ రికార్డును బద్దలు కొట్టాలని చూస్తున్నారు.