తెలంగాణలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ట్వీట్ ఇప్పుడు కలకలం రేపుతోంది. టీఎస్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలు నేడు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫలితాల్లో గణేష్ అనే విద్యార్థి 4 సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. దీనితో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు.
దీనితో ఆ విద్యార్థి ఓ ట్వీట్ చేశాడు. ఏం రాసిన పాస్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు అందరిని ఫెయిల్ చేశారు. నేను సూసైడ్ చేసుకోబోతున్న నా ఆత్మహత్యకు మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి కారణం అంటూ చెప్పుకొచ్చాడు.