టీఆర్ఎస్ కు బిగ్ షాక్..!

Big shock to TRS ..!

0
68

కొన్నేళ్ల నుంచి టీఆర్ఎస్ నాయకత్వంతో దూరంగా ఉంటూ వస్తున్న ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ మళ్లీ తిరిగి సొంత గూటికి చేరుకోనున్నారు. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో డీఎస్ సమావేశమయ్యారు.

రేపు ఏఐసీసీ కార్యాలయంలో డీఎస్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి రావాలని తెలంగాణ సిఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. భట్టి విక్రమార్కతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా రెండుసార్లు పని చేసిన డీఎస్.. దివంగత నేత వైఎస్ఆర్‌తో కలిసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేశారు. ఇక కాంగ్రెస్ హైకమాండ్‌కు అత్యంత సన్నిహితుడిగా కొనసాగారు. సోనియాగాంధీతో సమావేశమయ్యేందుకు ముఖ్యనేతలంతా ఎన్నో రోజులు నిరీక్షించిన తరుణంలోనూ డీఎస్ కొన్ని గంటల వ్యవధిలోనే ఆమెతో సమావేశమైన సందర్భాలు చాలా ఉన్నాయి.